‘చౌకీదార్ చోర్ హై’ ప్రచారానికి ఈసీ బ్రేక్

న్యూ ఢిల్లీ: మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఈసీ షాకిచ్చిం ది. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ చేస్తున్న ‘చౌకీదార్ చోర్ హై’ పోలింగ్​ క్యాంపెయిన్ ను ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసింది. చౌకీదార్ చోర్ హై ఆడియో, వీడియో అడ్వర్టయిజ్ మెంట్ ప్రసారం చేయడం ఆపేయాలని గురువారం అన్ని జిల్లాల అధికారులకు రాష్ట్ర జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రాజేశ్ కౌర్ నోటీసు జారీ చేశారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ ఇన్స్ పెక్షన్ కమిటీ కాంగ్రెస్ కు ఈ నెల 5న ఇచ్చిన అడ్వర్టయిజ్ సర్టిఫికేషన్ ను రద్దు చేసిందని, వెంటనే ప్రసారాలు నిలిపి వేయాలని ఆదేశించారు.

ప్రధాని చౌకీదార్ ప్రచారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన చౌకీదార్ చోర్ హై ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రకటనలో ఎవరి పేరూ వాడలేదని, ఈసీ తన నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని కాంగ్రెస్ కోరింది.

Latest Updates