చెలరేగిన గేల్..రాజస్థాన్ టార్గెట్-186

అబుదాబి: ఐపీఎల్ సీజన్ -13లో భాగంగా శుక్రవారం  రాజస్థాన్‌ రాయల్స్‌ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌ లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ విధ్వంసకర బ్యాట్స్‌ మన్‌‌ క్రిస్‌ గేల్‌(99) హాఫ్ సెంచరీతో మరోసారి రెచ్చిపోయి ఆడాడు. ఓపెనర్ కేఎల్ రావుల్(46) కూడా పర్వాలేదనిపించాడు.

రాజస్థాన్ బౌలర్లలో జోప్రా ఆర్చార్ , బెన్ స్టోక్స్ చెరో 2 వికెట్లు తీశారు.

Latest Updates