సిక్సర్ల మొనగాడు గేల్: అఫ్రిది రికార్డు హుష్ కాకి

వెస్టిండీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ మరో రికార్డును కైవసం చేసుకున్నాడు.ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన క్రికెటర్‌గా గేల్‌ నిలిచాడు. బుధవారం ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో అతను ఏకంగా 12 సిక్సర్లు బాది 135 పరుగులు చేశాడు. దీంతో గేల్ ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో కొట్టిన సిక్సర్ల సంఖ్య 488కు చేరింది. పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ అఫ్రిది 524 మ్యాచ్‌ల్లో 476 సిక్సర్లతో ఉన్న రికార్డును… గేల్‌ 444 మ్యాచ్‌ల్లో 488 సిక్సర్లతో బ్రేక్ చేశాడు. గేల్‌ వన్డేల్లో 287 సిక్సర్లు, టెస్టుల్లో 98, T20ల్లో 103 సిక్సర్లు కొట్టి ఈ అరుదైన రికార్డు తనపేరిట రాసుకున్నాడు.

Latest Updates