గేల్ కు నిరాశ..టెస్టులో దక్కని చోటు

  •  కొత్తగా రఖీమ్‌‌కు చాన్స్‌‌
  •  విండీస్‌‌ టెస్ట్​ టీమ్‌‌ ఎంపిక

పోర్ట్‌‌ ఆఫ్‌‌ స్పెయిన్‌‌: ఫేర్‌‌వెల్‌‌ టెస్ట్‌‌ మ్యాచ్‌‌పై భారీ ఆశలు పెట్టుకున్న విండీస్‌‌ విధ్వంసకర బ్యాట్స్‌‌మన్‌‌ క్రిస్‌‌ గేల్‌‌కు చుక్కెదురైంది. ఇండియాతో జరిగే రెండు టెస్ట్‌‌ల సిరీస్‌‌కు ఎంపిక చేసిన కరీబియన్‌‌ టీమ్‌‌లో అతనికి చోటు దక్కలేదు. ఈ సిరీస్‌‌ కోసం 13 మందితో కూడిన టీమ్‌‌ను విండీస్‌‌ బోర్డు శనివారం ప్రకటించింది. ఇండియా–ఎతో జరిగిన అనధికార టెస్ట్‌‌ల్లో రాణించిన రఖీమ్‌‌ కార్న్‌‌వాల్‌‌కు అవకాశం ఇచ్చారు. 2014లో క్రికెట్‌‌ మొదలుపెట్టిన 26 ఏళ్ల రఖీమ్‌‌..  6.6 అడుగుల ఎత్తు,140 కేజీల బరువు ఉంటాడు. అద్భుతమైన ఆఫ్‌‌ స్పిన్నర్‌‌గా, లోయర్‌‌ మిడిలార్డర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గా గుర్తింపు పొందాడు. ఫస్ట్‌‌క్లాస్‌‌ క్రికెట్‌‌లో రఖీమ్‌‌.. 55 మ్యాచ్‌‌ల్లో 260 వికెట్లు పడగొట్టాడు. 2224
రన్స్‌‌ చేశాడు.

వెస్టిండీస్‌‌: హోల్డర్‌‌ (కెప్టెన్‌‌), బ్రాత్‌‌వైట్‌‌, బ్రావో, బ్రూక్స్‌‌, క్యాంప్‌‌బెల్‌‌, ఛేజ్‌‌, రఖీమ్‌‌, డోవ్రిచ్‌‌, గాబ్రియెల్‌‌, హెట్‌‌మయర్‌‌, హోప్‌‌, పాల్‌‌, రోచ్‌‌.

Latest Updates