లారా రికార్డులు బ్రేక్ చేసిన క్రిస్ గేల్‌

chris-gayle-passes-brian-laras-west-indies-run-record-in-300th-odi

భారత్‌తో క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్‌ వెటరన్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ రెండు రికార్డులు సాధించాడు. భారత్‌తో జరిగిన రెండో వన్డే గేల్‌ కెరీర్‌లో 300వ వన్డే. వెస్టిండీస్‌ తరఫున 300 వన్డేలు ఆడిన తొలి ఆటగాడిగా గేల్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ లిస్టులో మాజీ దిగ్గజం బ్రయాన్‌ లారా (299) రెండో స్థానంలో ఉన్నాడు.

వెస్టిండీస్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గానూ గేల్‌ (10,408) రికార్డు నెలకొల్పాడు. రెండో వన్డేలో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర లారా (10,405)ను గేల్‌ అధిగమించాడు. ఈ మ్యాచ్‌కు ముందు గేల్‌ 10,397 పరుగులతో ఉన్నాడు. రెండు బ్రయాన్‌ లారా రికార్డులే బ్రేక్ చేశాడు గేల్.

Latest Updates