ఇంటర్నేషనల్ క్రికెట్ కు క్రిస్ గేల్ గుడ్ బై

వెస్టిండీస్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఆగస్టులో టీమిండియాతో జరిగే టెస్ట్ సిరీస్ తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని గేల్ ఇంతకు ముందే ప్రకటించాడు. అయితే తన నిర్ణయాన్ని మార్చుకుని… ఇండియాతో సిరీస్ తర్వాత తప్పుకుంటానని తాజాగా తెలిపాడు.

1999లో టీమిండియాతో జరిగిన వన్డే మ్యాచ్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన గేల్…  ఇండియాతోనే చివరి మ్యాచ్ ఆడనున్నాడు. వెస్టిండీస్ తరపున 103 టెస్టులు, 295 వన్డేలు, 58 టీ-20 మ్యాచ్ లు ఆడాడు గేల్. టెస్టుల్లో 7,214 పరుగులు, వన్డేల్లో 10,345 రన్స్, టీ20ల్లో 1,627 పరుగులు సాధించాడు. ఆగస్ట్ లో విండీస్ తో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.

Latest Updates