చాహల్ సోషల్ మీడియా వీడియోలపై గేల్ ఆగ్రహం

న్యూఢిల్లీ: టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో యాక్టివ్ గా ఉంటూ ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈ వీడియోలు సహచర క్రికెటర్లతోపాటు వేరే కంట్రీ ప్లేయర్లకు విసుగు తెప్పిస్తున్నాయి. రీసెంట్ గా చాహల్ తో జరిగిన ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెషన్ లో అతడి సోషల్ మీడియా వీడియోల పై విండీస్ విధ్వంసక బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘చాహల్ నీతో మేం విసిగిపోయాం. నా జీవితంలో నిన్ను మళ్లీ చూడాలనుకోవడం లేదు. నిజంగా సోషల్ మీడియాలో నువ్వు చాలా కోపం తెప్పిస్తున్నావ్. సోషల్ మీడియా నుంచి నువ్వు వెంటనే ఎగ్జిట్ అవ్వాలి. టిక్ టాక్ లో నువ్వు పోస్టింగ్స్ చేయడం ఆపకపోతే నిన్ను బ్లాక్ చేసేస్తా’ అని చాహల్ తో గేల్ నేరుగా చెప్పాడు. చాహల్ వీడియోలపై ఇండియా కెప్టెన్ కోహ్లీ కూడా స్పందించాడు. సౌతాఫ్రికా వెటరన్ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ తో జరిగిన ఇన్ స్టా లైవ్ సెషన్ లో కోహ్లీ పాల్గొన్నాడు. ‘చాహల్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడంటే మీరు నమ్మలేరు. అతడి వయసు 29 ఏళ్లు. కానీ చాహల్ వీడియోలు చూడండి. నిజంగా అతడో జోకర్’ అని ఆ సెషన్ లో కోహ్లీ పేర్కొన్నాడు. కరోనా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన ప్లేయర్లు ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో లైవ్ వీడియో సెషన్స్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. ఎక్కువ మంది ఆటగాళ్లు సహచర ప్లేయర్లతోపాటు ఫ్రెండ్స్ కు వీడియో కాల్స్ చేస్తున్నారు.

Latest Updates