హైదరాబాద్ ఒక గ్రేట్ బ్రాండ్

హైదరాబాద్, వెలుగు : సీఐఐ తెలంగాణ తొలిసారి బ్రాండ్ సమిట్‌‌ను నిర్వహించింది. ఆర్గనైజేషన్లకు వాల్యును క్రియేట్ చేయడంలో బ్రాండ్స్ పోషిస్తోన్న పాత్ర గురించి ఈ సమిట్‌‌లో చర్చించారు. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే, తొలుత దాన్ని విన్‌‌ అయ్యే ఫార్ములాను అర్థం చేసుకోవాలని బ్రాండ్‌‌ సమిట్‌‌ ప్రారంభోత్సవానికి హాజరైన ఇండియా బ్యాడ్మింటన్‌‌ టీమ్‌‌ నేషనల్ కోచ్ పుల్లెల గోపిచంద్ చెప్పారు. క్వాలిటీ వర్క్‌‌ను అందించడంపైనే   ఎల్లప్పుడూ ఫోకస్ చేయాలన్నారు. మనందరికీ పర్సనల్ బ్రాండ్‌‌ ఒకటి ఉంటుందని, దానికే మనం కట్టుబడి ఉండాలని తెలిపారు. బ్యాడ్మింటన్ కోచ్‌‌గా తన జర్నీని ఆయన వివరించారు.  ఇన్‌‌స్టిట్యూషన్లకు వాల్యును క్రియేట్ చేయడంలో బ్రాండ్స్‌‌ కీలక పాత్ర పోషిస్తున్నట్టు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర కే ఎల్లా చెప్పారు. బ్రాండ్‌‌.. మోస్ట్ వాల్యుబుల్ అసెట్ అని చాలా కంపెనీలకు ఇప్పుడు అర్థమవుతుందన్నారు. ఈ డిజిటల్ కాలంలో, బ్రాండ్స్ నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని, అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీలు, సోషల్ మీడియా దీనిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని సుచిత్ర వివరించారు. బ్రాండ్స్ అంటే కేవలం ప్రొడక్ట్‌‌లు, సర్వీసులే కావని, దేశాలు, రాష్ట్రాలు కూడా అని ఆమె చెప్పారు. హైదరాబాద్‌‌ కూడా ఒక గ్రేట్ బ్రాండ్‌‌ అని తెలిపారు.

బ్రాండ్‌‌ అనేది ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్‌‌పై మనం పెట్టుకున్న ఆశలు, అంచనాలని హైదరాబాద్ సిటీ(క్రైమ్స్, సిట్) అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీసు, ఐపీఎస్‌‌ శిఖా గోయల్ చెప్పారు. బ్రాండ్ ఇమేజ్‌‌ను ఎప్పటికీ మార్చలేమన్నారు. హైదరాబాద్‌‌ సేఫ్‌‌ సిటీ అనే బ్రాండ్‌‌ ఇమేజ్‌‌ను క్రియేట్ చేసేందుకు పోలీసు డిపార్ట్‌‌మెంట్ పనిచేస్తోందని చెప్పారు. షీ టీమ్స్ కూడా అందుకే పనిచేస్తున్నాయన్నారు. షీ టీమ్స్‌‌పై మహిళలకు అవగాహన కల్పించేందుకు పలు అవేర్‌‌‌‌నెస్ ప్రొగ్రామ్‌‌లను కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహిళలకు స్నేహపూర్వక వాతావరణం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాలసీలతో సీఐఐ కలిసి పనిచేస్తోందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్ డీ రాజు చెప్పారు. సీఐఐ తెలంగాణ తొలిసారి బ్రాండ్‌‌ సమిట్‌‌ను నిర్వహించిందని, మెంబర్ల నుంచి మంచి స్పందన వచ్చినట్టు తెలిపారు. ఈ డిజిటల్ కాలంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఇన్నోవేట్ కాకపోతే, చాలా కష్టమని చెప్పారు. హైదరాబాద్‌‌ ఫార్మా అండ్ బయోటెక్, స్టార్టప్‌‌లకు హబ్‌‌గా మారిందని సీఐఐ మాజీ ఛైర్మన్ అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ రవి రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సదస్సులో పలు రంగాలకు, ఇన్‌‌స్టిట్యూషన్లకు చెందిన 200 మంది డెలిగేట్స్ హాజరయ్యారు. కంటెంట్, టెక్నాలజీ కలిసి కస్టమర్లకు మెరుగైన ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను అందించేందుకు ఎలా కృషి చేస్తున్నాయో వివరించారు. బ్రాండ్ బిల్డింగ్‌‌లో ఏఐ పోషిస్తోన్న పాత్రపై కూడా స్పీకర్లు మాట్లాడారు.

Latest Updates