బొగ్గు కార్మికులకు దసరా బోనస్‌‌

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు:  బొగ్గు గని కార్మికులకు చెల్లించే దసరా, దీపావళి బోనస్ రూ.64,700గా కోల్ ఇండియా యాజమాన్యం, బొగ్గుగని మంత్రిత్వశాఖ నిర్ణయించాయి. మంగళవారం రాత్రి ఢిల్లీలో కార్మిక సంఘాలతో నిర్వహించిన మీటింగ్‌‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కోల్ ఇండియాలో దసరా సందర్భంగా బోనస్ చెల్లిస్తారు. సింగరేణిలో కార్మికులకు దీపావళి సందర్భంగా ఇంతే మొత్తాన్ని బోనస్‌‌గా చెల్లిస్తారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికుల వాటాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Latest Updates