రాజశేఖర్ ఆవేశపరుడు: హీరో సుమన్

శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

‘మా’డైరీ ఆవిష్కరణలో హీరో రాజశేఖర్ అలా మాట్లాడటం తప్పని, ఆయన ఆవేశపరుడని సినీ హీరో సుమన్ అన్నారు. శనివారం పలువురు సినీ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ నటుడు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, నటుడు సుమన్ ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయక స్వామి మండపంలో వీరిని పట్టువస్త్రాలతో సత్కరించిన వేదపండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందచేశారు.

దర్శనం అనంతరం ఆలయం వెలుపల నటుడు సుమన్ మీడియాతో మాట్లాడారు. తాను సినీఇండస్ట్రీకి వచ్చి 41 సంవత్సరాలు పూర్తి చేసుకొని 42వ సంవత్సరంలో అడుగు పెట్టానన్నారు. స్వామి వారి దయతో, తల్లితండ్రుల ఆశీర్వాదంతో.. 9 భాషల్లో కలిపి మొత్తం 500 సినిమాల్లో నటించానని ఆయన అన్నారు. అందులో 100 సినిమాలు హీరోగా చేశానని సమన్ తెలిపారు. ‘మా’ గొడవలు చాలా చిన్న విషయం, వాటిని ఇంతలా ఎక్సేపోజ్ చెయ్యడం బాధాకరమని ఆయన ఆన్నారు. ‘మా’ లో సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని హీరో సమన్ తేల్చారు. కాగా.. డైరీ ఆవిష్కరణలో నటుడు రాజశేఖర్ అలా మాట్లాడటం తప్పేని సుమన్ అన్నారు. అంతేకాకుండా.. రాజశేఖర్ కొంచెం ఆవేశపరుడని సమన్ పేర్కొన్నారు. ‘మా’కు సంబంధించిన అన్నివిషయాలను ఇలా బయటపెట్టడం సరికాదని ఆయన అన్నారు. కొన్ని విషయాలు బయట చెప్పేవి ఉంటాయని, మరొకొన్ని బయటకు చెప్పకూడనివి కూడా ఉంటాయని ఆయన అన్నారు. చిరంజీవి అన్నట్లు.. కూర్చొని మాట్లాడితే ఏ సమస్య అయినా పరిష్కారమవుతందని ఆయన అన్నారు. ఆవేశపడి మాట్లాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని నటుడు సుమన్ అన్నారు.

For More News..

గిన్నిస్ బుక్‌లోకెక్కిన ప్రపంచపు పొట్టి వ్యక్తి ఇకలేరు

ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ స్టేడియం.. ఎంతమంది కూర్చొవచ్చంటే..

దాడి వీడియో: రేప్ బాధితురాలి కుటుంబంపై దాడి.. తల్లి మృతి

Latest Updates