మాకూ ఉన్నయ్​ హెల్త్​ ఇష్యూస్​

‘ఆళ్లకేందిరబై.. బిందాస్​ లైఫ్​. ఫైవ్​స్టార్​ హోటళ్ల ఫుడ్​, సిక్స్​ప్యాక్​ కోసం జిమ్​, దగ్గినా, తుమ్మినా ఎంబటే డాక్టర్లు. అందుకే ఆళ్లంత హెల్దీగా, బ్యూటిఫుల్​గా, ఏ హెల్త్​ ఇష్యూస్​ లేకుండా ఉంటరు’.. సెలబ్రిటీల గురించి మీ ఒపీనియన్​ ఇదేనా? కానీ.. మేమేం పైనుంచి దిగిరాలే. మాకూ ఎన్నో సమస్యలుంటయ్​! టైంకు తినం..
టైంకు పడుకోం.. యాక్టింగ్​ కోసం ఏవేవో చెయ్యాలె. మేకప్​ పేరుతో ఏదేదో పూసుకోవాలె. సినిమా సక్సెస్​ అయితదో? లేదో? అనే భయం..  ఇట్ల చెప్పుకుంటపోతే మీకంటే మాకే హెల్త్​ ఇష్యూస్​ ఎక్కువగా ఉంటయ్​”అంటున్నరు హీరోహీరోయిన్లు.

కింగ్​ఖాన్​కు డిప్రెషన్..

‘ఢర్​’ సినిమాలో ‘కి..కి..కి.. క్కిరణ్’​ అంటూ డిప్రెషన్​ ఉన్న పాత్రలో కనిపించి, ఎంతగానో మెప్పించిన షారుఖ్​ఖాన్​ రియల్​లైఫ్​లో కూడా ఓసారి ‘సివియర్​ డిప్రెషన్​’ లోకి వెళ్లిపోయారట. సూసైడ్​ కూడా చేసుకోవాలని ప్రయత్నించారట. ఫ్యామిలీ మెంబర్స్​, ఫ్రెండ్స్​, సైకియాట్రిస్టుల సపోర్ట్​తో దాని నుంచి బయటపడ్డానని, నటనపై ఉన్న ప్రేమే తనను డిప్రెషన్​ నుంచి బయటకు తీసుకొచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

సూపర్స్టార్కు ఎమెసిస్..

తనదైన మేనరిజంతో ఎంతో యాక్టివ్​గా కనిపించే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్​కు 2011లో  ‘ఎమెసిస్’ అనే సమస్య ఎదురైంది. శ్వాసనాళాలు ఉబ్బిపోవడంతో ఊపిరి తీసుకునేందుకే ఇబ్బంది పడ్డారు. దీంతో కొన్నాళ్లు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలపాటు సింగపూర్​కు వెళ్లి ట్రీట్​మెంట్​ కూడా చేయించుకున్నారు. ప్రస్తుతానికి కోలుకున్నా.. జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెప్పడంతో పొల్యూషన్​ ఎక్కువగా ఉన్న ప్లేస్​లో షూటింగ్​కు వెళ్లడంలేదు.

డయాబెటిక్​​ కమల్

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా ‘టైప్–1డయాబెటిస్’ తో బాదపడుతున్నారట. ‘‘నటన కోసం రకరకాల ఫీట్లు చేయడం, స్ట్రెస్​ వల్ల  షుగర్​ వచ్చింది. అందుకే ఫుడ్​ హ్యాబిట్స్​ పూర్తిగా మార్చుకున్నా.  ఎక్కడ షూటింగ్​ ఉన్నా టైంకు తినడం అలవాటు చేసుకున్నా., అయినా రోజూ ట్యాబ్లెట్​ వేసుకోవడం మాత్రం తప్పడం లేద’’ని ఇటీవల ఓ ప్రెస్​మీట్​లో చెప్పాడు.

హండ్రెడ్​ పర్సెంట్​ ఆరోగ్యంగా ఉండడం ఈ రోజుల్లో అసాధ్యమే.  సెలబ్రిటీలైతేనే అలా ఉండడం సాధ్యమనుకుంటారు. ఎందుకంటే.. వాళ్లు హెల్త్​ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారనుకుంటాం.  అంతేకాదు  స్పెషల్​గా డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు, ఫిట్​నెస్​ ట్రైనర్లు ఉంటారు కాబట్టి వాళ్లకు ఎటువంటి హెల్త్​ ఇష్యూస్​ ఉండవనుకుంటాం. కానీ..  వాళ్లేం పైనుంచి దిగిరాలేదు. వాళ్లూ మనలా మనుషులే. సామాన్యులతో పోలిస్తే సెలబ్రిటీలకే అనారోగ్య సమస్యలు ఎక్కువని ఇటీవల చేసిన ఓ సర్వే తేల్చింది.

సెలబ్రిటీ లైఫ్​ అంటే బిందాస్​గా ఏమీ ఉండదు. వాళ్లకుండే ప్రాబ్లమ్స్​ వాళ్లకుంటాయి. కనీసం టైంకు తినే పరిస్థితి కూడా ఉండదు. సినిమాస్టార్స్​కైతే  ఈ సమస్యలు మరింత ఎక్కువ. షూటింగ్​ పేరుతో రకరకాల లొకేషన్లలో పనిచేయాల్సి ఉంటుంది. మేకప్​ పేరుతో హానికరమైన కెమికల్స్​ను కూడా వాడాల్సి ఉంటుంది. అందంగా కనిపించడానికి, సన్నగా కనిపించడానికి, సిక్స్​ప్యాక్​తో కనిపించడానికి, కొన్నిసార్లు లావుగా కనిపించడానికి రొటీన్​ లైఫ్​ను పక్కనపెట్టి బతకాల్సి ఉంటుంది. అవకాశాలు దక్కాలంటే ఈ ఫీట్లన్నీ చేయాల్సిందే. దీంతో రకరకాల అలర్జీలు, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. పాపులారిటీ కోసం రకరకాల వర్కవుట్స్​ చేస్తున్నట్లు వీడియోలను పోస్ట్​ చేసినంతమాత్రన వాళ్లు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపించినా.. వాళ్లకూ హెల్త్​ ఇష్యూస్​ ఉంటాయి. అలా లైఫ్​లో అనారోగ్య సమస్యలను ఫేస్​ చేసి, వాటి నుంచి బయటపడిన, ఇప్పటికీ ఫైట్​ చేస్తున్న కొందరు సెలబ్రిటీలపైనే ఈ స్టోరీ..

బిగ్​ బికి మేస్టేనియా గ్రావిస్​..

టీబీ గురించి చాలామంది బయటకు చెప్పుకోరు. కానీ అమితాబ్​ మాత్రం తాను టీబీతో బాధపడుతున్నట్లు ఓపెన్​గానే చెప్పాడు. రెగ్యులర్​గా ట్రీట్​మెంట్​ కూడా చేయించుకుంటున్నానని చెప్పాడు. ఇది అందరికీ తెలిసిందే… అయితే 1984లోనే అమితాబ్​ ఓ అరుదైన వ్యాధితో బాధపడ్డారట. దానిపేరు ‘మిస్టేనియా గ్రావిస్​’. ఇది మనిషిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనంగా మార్చేస్తుందని, తాను మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో, సరైన ట్రీట్​మెంట్​తో ‘మిస్టేనియా గ్రావిస్​’ నుంచి బయటపడ్డానని కౌన్​ బనేగా కరోడ్​పతి ప్రోగ్రామ్​లో చెప్పాడు అమితాబ్​.

ఇలియానాకి
బాడీ డిస్ మార్ఫిక్ డిజార్డర్..

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఇలియానా ఓ వింత అనారోగ్య సమస్యను ఎదుర్కొందట. హీరోయిన్​గా సెటిల్​ అయ్యాక కూడా ఆ సమస్య ఆమెను వేధించిందట. అదేంటంటే.. ‘బాడీ డిస్​ మార్ఫిక్​ డిజార్డర్​’. ఇది కూడా ఓ మానసిక సమస్యే. అయితే డిప్రెషన్​ కంటే ఎన్నో రెట్లు తీవ్రమైన మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. తన బాడీ షేప్​పై కొందరు కామెంట్​ చేయడంతో తనలో ఈ సమస్య మొదలైందని, దీనినుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకోవాలని కూడా ట్రై చేశానని ఒకప్పటి చేదు జ్ఞాపకాన్ని ఇటీవల ఓ ప్రెస్​మీట్​లో బయటపెట్టింది ఇలియానా. అయితే తనకుతానే ధైర్యం చెప్పుకొని, డాక్టర్ల సూచనలు కచ్చితంగా పాటించి సమస్య నుంచి బయటపడిందట.

సమంతకు ఎండపడదు..

చూడ్డానికి అమాయకంగా, నాజూగ్గా కనిపించే అక్కినేనివారి కోడలు సమంత జిమ్​లో చేసే వర్కవుట్స్​ చూసి చాలా ఆశ్చర్యపోతుంటాం. అంత స్ట్రాంగ్​గా, హెల్ల్దీగా ఉందా? అనుకుంటాం. అయితే ఆమెకు కూడా ఓ  ఓ హెల్త్​ ఇష్యూ ఉంది.  తాను ‘పాలిమార్ఫస్’ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పింది సమంత. ఎండలో కాసేపు ఉంటే..  చర్మం ఎర్రబడిపోవడంతోపాటూ దురదలు మొదలై ర్యాషెస్​ వచ్చేస్తాయట. బాగా ఫెయిర్​గా ఉన్నవారికైతే ఈ సమస్య మరింత ఇబ్బంది పెడుతుందని చెప్పింది. అందుకే ఏదైనా సినిమాను ఒప్పుకునేముందే దర్శకుడు, నిర్మాతలతో ఈ విషయాన్ని చెప్పి, తగిన జాగ్రత్తలు తీసుకుంటుందట.

సోనమ్కు షుగర్

సన్నగా.. నాజూగ్గా.. మెరుపుతీగలా ఉండే బాలీవుడ్​ ఫ్యాషన్​ ఐకాన్​ సోనమ్​ కపూర్​ను చూస్తే ఎంతో హెల్దీగా ఉందనుకుంటాం. కానీ ఆమెకు షుగర్​ వ్యాధి ఉందనే విషయం చాలామంది చెప్పినా నమ్మరు. నిజానికి ఇండస్ట్రీకి రాకముందు నుంచే సోనమ్​ డయాబెటిస్​తో బాధపడుతోందట. జీరోసైజ్​ కోసమని కొన్నిసార్లు, అందంగా కనిపించడానికి కొన్నిసార్లు సరైన డైట్​ తీసుకోకపోవడం వల్లే తాను డయాబెటిస్​బారిన పడ్డానని ఇప్పటికే చాలాసార్లు చెప్పింది సోనమ్​. ఇప్పుడుమాత్రం హెల్దీ డైట్​ తీసుకుంటూ, రెగ్యులర్​గా వర్కవుట్స్​ చేస్తూ షుగర్​ను కంట్రోల్​ చేసుకుంటున్నట్లు చెప్పింది.

సల్మాన్ ఖాన్​కు
ట్రిగెమినల్ న్యూరాల్జియా..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘ట్రిగెమినల్ న్యూరాల్జియా’ అనే వ్యాధితో బాధపడుతున్నాడట. ఇప్పటికీ దీని కోసం ట్రీట్​మెంట్ తీసుకుంటూనే ఉన్నాడట. ఈ వ్యాధివల్ల తీవ్రమైన దవడ నొప్పి, బుగ్గల నొప్పి భరించలేనంతగా ఉంటుందట.  అమెరికాలో తీసుకుంటున్న ట్రీట్​మెంట్​తో చాలావరకు తగ్గిందని, అయితే పూర్తిగా బయటపడలేదని ఓ డ్యాన్స్​ షోకు హాజరైన సందర్భంగా చెప్పాడు సల్లూభాయ్​.

స్నేహా ఉల్లాల్​కు
ఆటో ఇమ్యూన్ డిజార్డర్..

ఐశ్వర్యరాయ్​ను పోలిన అందంతో టాలీవుడ్​లోకి ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ అడుగుపెట్టిన నటి స్నేహా ఉల్లాల్​. ఒకప్పుడు వరుస చిత్రాల్లో కనిపించినా ఇప్పుడు ఎక్కడ ఉంటుందో కూడా చాలా మందికి తెలియదు. అందుకు కారణం.. ఆమె అనారోగ్యమే. ‘ఆటో ఇమ్యూన్​ డిజార్డర్​’అనే సమస్యతో బాధపడుతోందట. ఇది రక్తానికి సంబంధించిన అనారోగ్య సమస్య. దీనివల్ల బాధితుల్లో రోగనిరోధక శక్తి ఒక్కోసారి పూర్తిగా పడిపోతుంది. అటువంటివారు బయట తిరిగితే ఎన్నోరకాల వ్యాధులకు గురవుతారు.  స్నేహా ఉల్లాల్​ కూడా ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం కూడా ఇదేనట.

Latest Updates