నేటి నుంచి సినిమా హాల్స్ ఓపెన్.. మారిన టైమింగ్స్..

కరోనా మహమ్మారి వల్ల మూతపడ్డ సినిమా థియేటర్లు దాదాపు ఏడు నెలల తర్వాత నేడు ఓపెన్ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్ 5 మార్గదర్శకాల ప్రకారం దేశంలోని పలు ప్రాంతాల్లోని సినిమా హాళ్లు తిరిగి ప్రారంభించడానికి అనుమతులు లభించాయి. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే థియేటర్లు ఓపెన్ చేయడానికి అనుమతులిచ్చాయి. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం కరోనా భయంతో థియేటర్ల ప్రారంభానికి అనుమతులివ్వలేదు.

ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు కర్ణాటక రాష్ట్రాలు థియేటర్లు ఓపెన్ చేయాలని నిర్ణయించాయి. కాగా.. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గర్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం థియేటర్లు, మల్టీప్లెక్సుల ఓపెన్‌కు అనుమతులు లభించలేదు. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఎటువంటి మార్గదర్శకాలను జారీ చేయనందున సినిమా హాళ్లు నేటి నుంచి తెరవబడవు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. థియేటర్లలో యాభై శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండాలి. అదేవిధంగా సినిమా ప్రదర్శన సమయాలలో వ్యత్యాసం ఉండాలి. ప్రేక్షకులు మరియు సిబ్బంది సామాజిక దూరం, థర్మల్ స్క్రీనింగ్ పాటించేలా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ప్రేక్షకుల నుంచి ఫోన్ నంబర్లను తప్పనిసరిగా తీసుకోవాలిని సూచించింది.

అదేవిధంగా.. థియేటర్లలో అమ్మె ఆహార పదార్థాలను వినియోగదారులకు ఇచ్చేముందు తప్పకుండా UV కిరణాల కింద స్క్రీనింగ్ చేసి ఇవ్వాలి. కరోనా దృష్ట్యా అదనపు ఏర్పాట్లు చేసినప్పటికీ.. టిక్కెట్లు మరియు ఆహార పదార్థాల ధరలు ప్రీ-కోవిడ్ రేట్ల మాదిరిగానే ఉంటాయని సినిమా హాల్ యాజమాన్యాలు పేర్కొన్నారు.

సినిమా ప్రారంభానికి ముందు మరియు సినిమా చివరలో కోవిడ్-భద్రతా నిబంధనలు మరియు అవి పాటించబడకపోతే విధించే శిక్షలను ప్రసారం చేస్తారు. సాంఘిక దూరం పాటించేలా సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఇచ్చారు. అలాగే ప్రేక్షకునికి థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే థియేటర్‌లోకి అనుమతించాలని నిర్ణయించారు.

కాగా.. ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాలు ఏవీ విడుదలకు సిద్ధంగా లేవు. దాంతో అనేక పాత సినిమాలు మళ్లీ విడుదల కానున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా చిచోర్, కేదార్‌నాథ్, తన్హాజీ, శుబ్ మంగల్ జ్యదా సావ్ధాన్, మలంగ్, వార్ మరియు తప్పాడ్ వంటి సినిమాలు మరోసారి పెద్ద స్క్రీన్‌లలో ప్రదర్శించబడనున్నాయి.

దేశవ్యాప్తంగా పలు సినిమా హాళ్లను కలిగి ఉన్న పీవీఆర్ సినిమాస్ రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పీవీఆర్ సంస్థకు దేశవ్యాప్తంగా సుమారు 500 సినిమా హాళ్లు ఉన్నాయి.

ప్రీ-కోవిడ్ రోజులతో పోలిస్తే.. ప్రస్తుతం సినిమా ప్రదర్శనలు చాలా తక్కువగా ఉంటాయి. చాలా థియేటర్లలో ప్రదర్శనలు మధ్యాహ్నం 12 నుండి 8 గంటల మధ్య మాత్రమే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. థియేటర్ల కూడా డిజిటల్ చెల్లింపులను అనుమతిస్తాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ కౌంటర్ల వద్ద ప్రేక్షకులు గుమికూడకుండా టికెట్ కౌంటర్ల సంఖ్యను పెంచనున్నారు. అంతేకాకుండా.. ఈ కౌంటర్లను తరచుగా శానిటైజేషన్ చేయాలని కేంద్రం సూచించింది.

For More News..

యువతిని కిడ్నాప్ చేసి 22 రోజుల పాటు గ్యాంగ్ రేప్

భార్యను సంవత్సరం పాటు టాయిలెట్‌లో బంధించిన భర్త

ఆడియో: వరదలో కొట్టుకుపోతూ కాపాడాలంటూ ఫోన్‌లో వెంకటేష్ చివరి మాటలు

తెలంగాణలో కొత్తగా 1,432 కరోనా కేసులు

Latest Updates