ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను నివారించు

cinema-ticket-rose-flower-for-those-who-follow-the-traffic-rules

హైదరాబాద్ జంటనగరాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వారు హైదరాబాద్ లో చాలా మంది కనిపిస్తారు. అయితే ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాహనదారులను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సత్కరించారు. తన సిబ్బందితో సహా ట్రాఫిక్ తనిఖీల్లో పాల్గొన్న కమిషనర్… ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారందరిని మెచ్చుకున్నాడు.

గత 10 సంవత్సరాల నుంచి ట్రాఫిక్ రూల్స్ ను క్రమంతప్పకుండా పాటిస్తున్న వాహనదారులను హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా అవగాహన కలిపించాలని ఆయన వాహనదారులను కోరారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఈ సందర్భంగా సిపి నగర ప్రజలకు సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను నివారించాలని, అతివేగం మంచిది కాదని తెలిపారు.

Latest Updates