డాక్టరైన పోలీసు : ప్రయాణికుడికి ప్రాణం పోశాడు

వారణాసి: గుండెపోటు వచ్చిన ఓ వ్యక్తిని కాపాడి అందరి ప్రశంసలు అందుకున్నారు CISF ఇన్ స్పెక్టర్. వారణాసి ఎయిర్ పోర్టు ఆవరణలో ఓ ప్రయాణికుడికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఇన్ స్పెక్టర్ నీరజ్ కుమార్ ప్రయాణికుడికి వెంటనే కార్డియోపల్మనరీ రెసస్కిటేషన్ (CPR)అందించారు. ఆ తర్వాత ప్రయాణికుడిని హస్పిటల్ లో చేర్పారు. CPR తర్వాత వెంటనే ట్రీట్ మెట్ అందించడంతో ప్రయాణికుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని తెలిపారు డాక్టర్లు. నీరజ్ కుమార్ ను ఎయిర్ పోర్టులో ఉన్న సిబ్బంది, ప్రయాణికులు ప్రశంసలతో ముంచెత్తారు. అత్యవసర పరిస్ధితిలో .. డాక్టర్ చేయాల్సిన డ్యూటీ పోలీసు ఆఫీసర్ చేశారని.. మీరు గ్రేట్ సార్ అంటూ నీరజ్ కు కితాబిచ్చారు నెటిజన్లు.

Latest Updates