13 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందికి వైరస్

న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) ఢిల్లీ మెట్రో యూనిట్ లో 13 మందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయినట్లు అధికారులు శనివారం తెలిపారు. దీంతో సీఐఎస్ఎఫ్​ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 48 కి చేరుకుంది. ఇందులో ఎక్కువగా ఢిల్లీ మెట్రో యూనిట్ లో పనిచేసేవారు కాగా.. ఆ తర్వాత ముంబై ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు గార్డింగ్ యూనిట్​లో పనిచేసేవారని తెలిపారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ముగ్గురు, అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు, కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ లో ముగ్గురు సీఐఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా సోకింది.

Latest Updates