లాక్‌‌డౌన్‌‌ ఉన్నా బయట తిరుగుతున్న బస్తీ జనాలు

వద్దన్నా.. వస్తున్నరు
ప్రభుత్వ రూల్స్‌, పోలీసుల హెచ్చరికలు పట్టించుకోట్లే
అవేర్‌నెస్‌‌ కల్పించాలంటున్న సైకాలజిస్ట్‌‌లు

హైదరాబాద్, వెలుగు: లాక్‌‌డౌన్‌ ఉన్నా జనాలు బాగానే జమైతున్నరు. రోడ్లపైకి రావడం, గుంపులుగా నిల్చొని బాతాఖానీ పెట్టడం లాంటివి చేస్తున్నరు. కరోనా నియంత్రణకు లాక్‌‌డౌన్‌‌ విధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూల్స్‌ ‌పాటించాలని సూచిస్తుంటే బస్తీజనాలు పట్టించుకోవడం లేదు. సాధారణ రోజుల్లో రోడ్లపై ఎలా ఉంటారో లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌లోనూ అలాగే కనిపిస్తున్నారు. జనాలకు మరింత అవేర్‌‌నెస్‌‌ పెంచాలని, లేదంటే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని సైకాలజిస్ట్‌‌లు హెచ్చరిస్తున్నారు.

ఉదయం నుంచే రోడ్లపైకి..
ఉదయం నుంచే బైక్ లపై తిరిగే వాళ్లు, పాదచారులతో గల్లీలు రద్దీగా ఉంటున్నాయి. మాస్క్, కర్చిప్‌, స్కార్ఫ్ వంటివి యూజ్ చేయకుండానే యథేచ్ఛగా తిరుగుతున్నారు. పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ మైక్‌‌ల ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. వారు వెళ్పోగానే మళ్లీ మాములుగానే వచ్చేస్తున్నారు. బస్తీ జనాలతో విసుగుచెంది బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.

కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో..
అపార్ట మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోఉండేవారు అలర్ట్‌‌గా ఉంటున్నారు. టీవీల్లో వచ్చే న్యూస్, పేపర్స్, వాట్సప్ ఫార్వర్డ్ మెసేజ్ ల ద్వారా కరోనా అప్‌డేట్స్‌ తెలుసుకుంటున్నారు. హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి కమ్యూనిటీ మెంబర్స్ కలిసి డోర్ బయట కావలసిన ఫుడ్, వస్తువులు పెడుతున్నారు. అపార్ట్ మెంట్లలో ఉండేవారు సూపర్ మార్కెట్లనుంచి కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకుంటున్నారు. బయటకు వచ్చినప్పుడు మాస్క్‌‌లు, గ్లౌజ్ లు వంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు.

భరోసా ఇవ్వాలె
బస్తీ జనాల్లో చాలామంది డైలీ లేబర్స్ ఉంటారు. లాక్ డౌన్‌‌తో పని లేకుండాపోయింది. రోజుగడవడం కష్టంగా మారింది. కరోనా నియంత్రణపై వారికి మరింతగా అవేర్‌‌నెస్‌ ‌కల్పించాలి. ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. ప్రభుత్వం ఆదుకుంటుందనే భరోసా ఇవ్వాలి.
‑ సంగీత, సైకాలజిస్ట్

For More News..

కరోనా వచ్చిందని 55 కి.మీ. నడిపించిన్రు

ఆఫీసుల్లో వెనక్కి తిరిగి కూర్చోండి

ఒలంపిక్స్ కొత్త తేదీలు ఖరారు

రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు మృతి

Latest Updates