శెభాష్ సిటీ పోలీస్ : మోకాలి లోతు నీళ్లలో డ్యూటీ

హైదరాబాద్ పోలీసులు మరోసారి తమ అంకితభావం చాటుకున్నారు. మాన్ సూన్ సీజన్ లో కష్టాలకు ఓర్చి హైదరాబాద్ ట్రాఫిక్, సివిల్ పోలీస్ శాఖలు పనిచేస్తుంటాయి. నీళ్లు నిలిచి ఉన్న ఏరియాల్లో, చెట్లు పడిపోయిన ప్రాంతాల్లో.. రాత్రి, పగలు డ్యూటీ చేస్తుంటాయి. ఈ వేసవిలోనూ.. అకాల వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ ను నియంత్రిస్తూ.. వర్షంలోనూ డ్యూటీ చేస్తూ సిటీ పోలీసులు శెభాష్ అనిపించారు.

ఈ సాయంత్రం హైదరాబాద్ లో మరోసారి జడివాన పడింది. మలక్ పేట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఏరియాలో భారీగా నీళ్లు నిలిచిపోయాయి. పెట్రోలింగ్ ఆఫీసర్ జి.శ్రీనివాస్ రెడ్డి(PC 4402) ఈ సమయంలో వాహనదారులకు చాలా సహాయపడ్డారు. తాను వర్షంలో తడుస్తూ.. మోకాలి లోతు నీళ్లలో నిలబడి వచ్చీ పోయే వాహనాలకు హెల్ప్ చేస్తూ … ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా డ్యూటీ చేశారు.

 

 

 

 

 

మలక్ పేట్ మెట్రో స్టేషన్ దగ్గర మోకాలి లోతు నీళ్లలో నిలబడి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ డ్యూటీ చేశారు. వాహనాలు నిలిచిపోకుండా… గైడ్ చేశారు.  ట్విట్టర్ లో వీరిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సిటీ పోలీసులు ఎప్పుడూ మీతోనే మీవెంటే అంటూ.. ఆ విభాగం బదులిచ్చింది.

ఇదే కాదు.. దిల్ సుఖ్ నగర్ -కోఠి మధ్య ఏరియాల్లో, చాంద్రాయణ గుట్ట, గౌలీగూడ ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. మాన్ సూన్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేశాయి.

 

Latest Updates