హిస్టరీ  లెక్చరర్లతో సివిక్స్ పాఠాలు

  • స్టేట్ లో మూడోవంతు కాలేజీల్లో ఇదే తీరు
  • మిగతా కాలేజీల్లో 2 సబ్జెక్టులకు వేర్వేరు లెక్చరర్లు
  •  లెక్చరర్లు చెప్పబోమన్నాపట్టించుకోని ఇంటర్‌ బోర్డు
  •  వేర్వేరు పోస్టులు క్రియేట్ చేయాలంటున్న లెక్చరర్లు

బీకామ్ లో ఫిజిక్స్.. ఎమ్మెస్సీలో పొలిటికల్‌ సైన్స్ఇదే తరహాలో ఉంది రాష్ట్ర ప్రభుత్వ తీరు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో హిస్టరీ లెక్చరర్లతో సివిక్స్ పాఠాలు చెప్పిస్తోంది. సర్కారీ పాత కాలేజీల్లో ఏండ్లుగా ఇదే రూల్ అమలవుతోంది. కొత్తగా పెట్టిన జూనియర్‌‌ కాలేజీల్లో మాత్రం సివిక్స్‌‌కు, హిస్టరీకి వేర్వు రు లెక్చరర్లు ఉన్నారు. పీజీలో తాము హిస్టరీ చదివామని, సివిక్స్‌‌ సబ్జెక్ట్‌‌తో సంబంధం లేదని లెక్చరర్లు చెబుతున్నా, ఇంటర్‌‌ బోర్డు పట్టించుకోవడం లేదు. పాఠాలు చెప్పాల్సిందేనని హుకుం జారీ చేస్తోంది. చేసేది లేక హిస్టరీ లెక్చరర్లే సివిక్స్‌‌ పాఠాలూ చెప్తున్నారు.

వందకుపైగా కాలేజీల్లో ఇదే పద్ధతి

రాష్ట్రం లో 404 సర్కారీ జూనియర్‌‌ కాలేజీలుండగా, 1.80 లక్షల మంది స్టూ డెంట్లు చదువుతున్నారు. పాఠాలు చెప్పేం దుకు 6,008 లెక్చరర్‌‌ పోస్టులను సర్కారు శాంక్షన్‌‌ చేసిం ది. అయితే పాతికేండ్ల కంటే ముందున్న కాలేజీల్లో సివిక్స్‌‌ లెక్చరర్ పోస్టులను ప్రభుత్వం శాంక్షన్‌‌ చేయలేదు.హెచ్‌ ఈసీ, సీ ఈసీ గ్రూప్స్‌‌లో సివిక్స్‌‌ ఉంటుంది.సివిల్స్‌‌ వైపు వెళ్లాలన్నా, ఇతర పోటీ పరీక్షలకూ ఆ సబ్జెక్టే కీలకం. మొదట్లో సివిక్స్‌‌ లెక్చరర్లు లేకపోవడంతో హిస్టరీ లెక్చరర్లతోనే సివిక్స్‌‌ పాఠాలు చెప్పించారు. ఇప్పటికీ అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. వాస్తవానికి హిస్టరీ లెక్చరర్‌‌కు సివిక్స్‌‌తో సంబంధం ఉండదు. పీజీలో హిస్టరీ చేసిన వారితో,సివిక్స్ పాఠాలు చెప్పిస్తుండటంతో లెక్చరర్లతోపాటు స్టూడెంట్లూ ఇబ్బందులు పడుతున్నారు. వందకు పైగా సర్కారీ కాలేజీల్లో ఇదే పద్ధతి ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.

ఉద్యోగాలకూ ఎసరు!

మొత్తం లెక్చరర్ల పోస్టుల్ లో 900 మందే పర్మినెంట్‌ వారు కాగా, మిగిలిన వారంతా కాంట్రాక్ట్‌‌, గెస్ట్‌‌,టైమ్‌‌ స్కేల్‌ లెక్చరర్లే. ప్రస్తుతం సివిక్స్‌‌ పాఠాలు చెప్తున్న హిస్టరీ లెక్చరర్లలో పర్మినెంట్‌ అయిన వారిని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. కాంట్రాక్ట్‌లెక్చరర్లు చెబుతున్న సబ్జెక్టుల్ లో ఎక్కువ మంది ఫెయిలైతే..వారి ఉద్యోగాలు పోతున్నాయి. ఇంటర్‌‌ ఎగ్జామ్స్‌‌ సమయంలో ఆ సబ్జెక్ట్‌‌ రిజల్ట్‌‌లో జిల్లా యావరేజీ కంటే, ఆ కాలేజీ తక్కువ శాతం ఉత్తీర్ణత సాధిస్తే, ఆ లెక్చరర్ల జాబ్‌ లకు ప్రమాదముంది. ఈ కారణంతో జాబ్స్ పోయిన వారు చాలామంది ఉన్నారు. హిస్టరీ లెక్చరర్లు హిస్టరీతో పాటు సివిక్స్ చెప్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. తమకు సంబంధంలేని సబ్జెక్ట్‌‌లో పాఠాలు చెప్పించి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని వారు వాపోతున్నారు. ఒకే సర్కారీ సంస్థలో రెండు రూల్స్‌‌ అమలు చేస్తుండటంపై లెక్చరర్లు మండిపడుతున్నారు. అయితే సివిక్స్‌‌ పోస్టుల శాంక్షన్‌‌ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా, ఎటువంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.

Latest Updates