ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ సిబ్బందికి కరోనా

చెన్నై: తమిళనాడులోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ) లో పనిచేస్తున్న సిబ్బంది ఒకరికి కరోనా కన్ఫామ్ అయింది. అయితే ప్రస్తుతం అక్కడ ఆర్మీ క్యాడెట్లు ఎవరూ లేరని ఓటీఏ అధికారులు బుధవారం వెల్లడించారు. ఓటీఏ కిచెన్ లో పనిచేస్తున్న వ్యక్తికి ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించామని, టెస్టులు చేసిన మేరకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. వెంటనే అతడ్ని ఐసోలేషన్ కు తరలించి ఎవరెవర్ని కలిసాడో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ‘‘ప్రస్తుతం అకాడమీలో క్యాడెట్లు ఎవరూ లేరు. ఒక బ్యాచ్ క్యాడెట్లు ఈమధ్యే పాస్ అవుట్ తో వెళ్లిపోయారు. ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్న బ్యాచ్ టర్మ్ బ్రేక్​లో ఉన్నారు”అని ఒక సీనియర్ అధికారి మీడియాతో అన్నారు. మెడికల్ టర్మ్స్ ప్రకారం అకాడమీలో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పారు.

Latest Updates