సివిల్స్ 131 ర్యాంకు కొట్టిన రైతు బిడ్డ శ్రీపాల్

చిన్నప్పటి నుంచీ ఐఏఎస్ కావాలని ఉండేది.అందుకే బేసిక్స్ లోతుగా చదువటం అలవాటైంది. ఇంజినీరింగ్ లో అడుగు పెట్టినప్పటి నుంచీ సీరియస్ గా కాన్సెం ట్రేషన్ చేసిన. అప్పటి నుంచి సివిల్స్ ప్రిపరేషనే నాలోకం. బీటెక్ ఫైనల్ ఇయర్ లో మొదటి సారి సివిల్స్ పరీక్ష ఎలా ఉంటుందో తెలుసుకున్నా. అప్పుడు ర్యాంకు రాలేదు. కానీ ఢిల్లీలోని శుభ్రరంజన్‍, విజన్‍ కోచింగ్‍ సెంటర్ల మెటిరియల్‍  చాలా ఉపయోగపడింది. ఇంటి దగ్గరే రోజుకు ఎనిమిది గంటలు ప్రిపేరైన. మోడల్ పేపర్స్, ఆన్ న్‍ ఎగ్జా మ్స్ రాయడం,కరెక్ట్​ ఆన్సర్స్ మళ్లీ తెప్పించుకునేటోణ్ని. ఇదే రెగ్యులర్ ప్రాక్టీస్.

ఓటమిని స్వీకరించే ధైర్యం ఉండాలి…

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారికి.. సలహాలు ఇచ్చే స్థాయికి నేను ఎదగలేదు. కానీ ఒక్క విషయం చెప్పదలుచుకున్నా .. సీరియస్ గా కష్టపడితే నాలుగు రోజులు అటు ఇటుగా అయినా రిజల్ట్ వస్తది. అదే సమయంలో సివిల్స్ లక్ష్యంతో వచ్చే వారు.. ఒకవేళ తాము అనుకున్న ఫలితాలు రాకున్నా స్వీకరించే ధైర్యంతో రావాలే. ఇది రాకుంటే మరో జాబ్‍ చేసి లైఫ్ లో సెటిలయితా.. అనేలా ఉండాలి. భవిష్యత్తులో నేను ఎక్కడ పనిచేసినా రైతులు, పేదోళ్లను ఆదుకునేలా విధులు నిర్వహిస్తా. సేవ చేయాలనే కాన్సె ప్ట్ తోనే సివిల్స్ దాకా వచ్చిన. అది చేతల్లో చూపెడతా.

లక్ష్యం తర్వాతే.. ప్రేమైనా, పెళ్లయినా…..

ప్రేమ, పెళ్లి అనేవి జీవితంలో ఓ భాగం. అవే జీవితం కాదు. మనకంటూ ఓ లక్ష్యం ఉండి ,దాన్ని సాధిస్తే అవి కూడా మనతో ఉంటాయి.అలా కాకుండా ఫస్ట్​ ఇంపార్టెన్స్ దానికే ఇస్తే ఫలితాలు వేరేలా ఉంటాయనేది నా ఒపీనియన్‍.

చిన్న రైతు కుటుంబం మాది….

మాది పల్లెటూరు. చిన్న రైతు కుటుంబం. అందుకే అమ్మా నాన్నల కాయ కష్టం తెలుసు. రైతుల కష్టాలు తెలుసు… కన్నీళ్లు తెలుసు. అమ్మ మంజుల, నాన్న సాంబశివరెడ్డి. నాకొక అక్క.. పేరు శ్రీజ. ఇప్పుడు గ్రూప్స్ కు ప్రిపేరవుతోంది. మా చిన్నప్పటి నుంచి అమ్మానాన్న ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మేమిద్దరం… వ్యవసాయమే వాళ్ల లోకం. కుటుంబ భారం.. మా చదువుల కోసం ఉన్న భూమికి తోడు కొంత భూమిని కౌలుకు తీసుకున్నారు. నా స్కూల్‍ చదువంతా వరంగల్ లోనే. ఏడో తరగతి వరకు ఆత్మకూర్ లోని సెయింట్‍ థెరిసా స్కూల్‍, 9,10 ధర్మసాగర్‍ మండలం ఉనికిచర్లలోని శ్రీనివాస రామానుజం స్కూల్ లో చదివిన. ఇంటర్ హైదరాబాద్ లోని నారాయణ కాలేజీ.. ఐఐటీ సీటొచ్చిం ది. వారణాసి ఐఐటీలో ఇంజినీరింగ్ . సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనే ఆలోచనతోనే సివిల్స్ ను టార్గెట్ చేసిన. ఎక్కడున్నా .. చుట్టున్న సమాజం, అక్కడి పరిస్థితులను లోతుగా పరిశీలిస్తా. అది సొంతూరు పత్తిపాక అయినా.. బీటెక్‍ చదివిన వారణాసి అయినా.. అక్కడి ప్రజల ఇష్టాలు, కష్టాలన్నీ తెలుసుకునేటోణ్ని. ప్రజలకు సేవ చేయాలి.. తోచిన సాయం చేయాలనే ఆలోచన అక్కడే మొదలైంది. సేవ చేయాలంటే ఉన్నతమైన పొజిషన్లో ఉండాలనుకున్నా. అందుకే సివిల్స్ వైపు నా చదువు.. నా ధ్యాసంతా.