CJIగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ప్రమాణ స్వీకారం

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) గా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ గొగోయ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు, మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, దేవెగౌడ,న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అస్సాం మాజీ సీఎం కేశవ్ చంద్ర గొగోయ్ కుమారుడైన రంజన్ గొగోయ్ దిబ్రూగ‌ఢ్‌లో 1954 నవంబర్ 18వ తేదీన జన్మించారు. ఢిల్లీ వ‌ర్సిటీలో న్యాయ‌విద్య‌ను అభ్య‌సించారు. 1978లో బార్ అసోసియేష‌న్‌లో చేరారు. 1978లో లాయర్ గా చేరి గౌహతి హైకోర్టులో ఎక్కువ కాలం పనిచేశారు. 2001 ఫిబ్రవరి 28న గౌహతి హైకోర్టు శాశ్వత జడ్జీగా నియమితులయ్యారు. 2010 సెప్టెంబర్ 9న పంజాబ్ – హర్యాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011 ఫిబ్రవరి 12న ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2012 ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి పొందారు.

సీజే జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అక్టోబర్‌ 2న పదవీ విరమణ చేశారు. కాగా.. జస్టిస్ రంజన్ గొగోయ్ వచ్చే ఏడాది నవంబర్ 17 పదవీవిరమణ చేస్తారు.

Posted in Uncategorized

Latest Updates