గల్లీ నుంచి ఢిల్లీ వరకు మార్మోగిన చప్పట్లు

కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు ‘జనతా కర్ఫ్యూ’కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ప్రజలంతా తమకు తాము స్వీయనిర్భంధంలో ఉండి, ప్రధాని పిలుపును పాటించారు. సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేయాలని ప్రధాని తెలిపినట్లు యావత్‌ భారతావని చప్పట్లతో జనతాకర్ఫ్యూకు, వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ వాసులంతా చప్పట్లతో వైద్య, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందికి సంఘీభావం ప్రకటించారు. నగరవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న కాలనీలు, వీధుల్లోని ఇండ్లలో నుంచి చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా బయటకు వచ్చి చప్పట్లతో అత్యవసర సేవలందిస్తున్న డాక్టర్లు సహా మిగిలిన విభాగాల సిబ్బందికి జై కొట్టారు.

Latest Updates