పంజాగుట్టలో కత్తిపోట్లు : ఒకరి మృతి

పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇద్దరు ఆటో డ్రైవర్లు కత్తులతో పొడుచుకున్నారు. రియా సత్ అలీ అనే వ్యక్తి కత్తితో దాడి చేయగా… మహమ్మద్ అన్వర్ అనే ఆటో డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోకి పరుగెత్తుకుంటూ వెళ్లాడు మహ్మద్ అన్వర్.  రక్తపుమడుగులో పోలీస్ స్టేషన్ కు వచ్చిన అన్వర్ ను 108 అంబులెన్స్ లో గాంధీకి తీసుకెళ్లారు పోలీసులు. కొందరు పోలీసులు స్పాట్ లోకి వెళ్లారు. రియాసత్ ఆలీని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.

గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మహమ్మద్ అన్వర్ చనిపోయాడు. ఆటో డ్రైవర్ రియా సత్ అలీపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Latest Updates