కేరళలో స్ట్రీట్ ఫైట్.. కట్టెలతో కొట్టుకున్న కార్యకర్తలు

కేరళ ఎన్నికల ప్రచారంలో రెండు ఫ్రంట్ లకు చెందిన కార్యకర్తలు కొట్టుకున్నారు. LDF(లెఫ్ట్ డెమోక్రెటిక్ ఫ్రంట్), UDF(యునైటెడ్ డెమోక్రెటిక్ ఫ్రంట్) కార్యక్తలు నిన్న ఆదివారం వేర్వేరుగా ప్రచారం చేస్తున్న టైమ్ లో తీవ్రమైన గొడవ జరిగింది.

UDF కు సపోర్ట్ గా..కాంగ్రెస్ నాయకులు మాజీ రక్షణ శాఖ మంత్రి ఏ.కే. ఆంటొనీ, శశి థరూర్ రోడ్ షో నిర్వహించారు. అదే రోడ్ లో LDF కార్యకర్తలు ఎదురుగా వచ్చారు. దీంతో ఇరు కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరిగింది. మాటా మాటా పెరగడంతో రెండు ఫ్రంట్ ల కార్యకర్తలు జెండా కట్టెలతో కొట్టుకున్నారు. బృందాలుగా విడిపోయి.. వీధిలో ఒకరిపై మరొకరు దాడిచేసుకున్నారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.

ఒక్కసారిగా ఇరు వర్గాలు దాడులు చేసుకోవడంతో భయానక పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్పందించిన పోలీసులు కార్యకర్తలను చెదరకొట్టారు. పరిస్థితి చేయిదాటడంతో శశి థరూర్, ఆంటోనీ రోడ్ షో మధ్యలోనే వెనుదిరిగారు.

Latest Updates