చదివింది ఆరే.. కానీ కరోనా వ్యాక్సిన్ తయారు చేశాడంట

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్ట్ లు కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యారు. కానీ  ఆరవ తరగతి వరకే చదువుకున్న ఓ వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తయారు చేసి దానిని అమ్మేందుకు సిద్ధమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఒడిశాకు చెందిన ప్రహల్లాద్ కరోనా ను వ్యాక్సిన్ ను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించాడు. తన స్వస్థలంలో వ్యాక్సిన్ సీసాలకు కరోనా లేబుళ్లను, సీసాలో వ్యాక్సిన్ ను స్టోర్ చేశాడు. అయితే ప్రహల్లాద్ పై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు జరిపారు.

ఈ దాడుల్లో నిందితుడు వ్యాక్సిన్ సీసాలకు కరోనా లేబుళ్లను అంటించడం గుర్తించారు.  అవసరం అయితే ఆ సీసాలో ఉన్న వ్యాక్సిన్ ల్యాబ్ కు పంపిస్తామని డ్రగ్ ఇన్ స్పెక్టర్  మల్లిక్ తెలిపారు.

టీకా  ఎలా తయారు చేశాడు..? అందులో ఏఏ పదార్ధాల్ని వినియోగించాడన్న ప్రశ్నలకు మల్లిక్ స్పందిస్తూ  టెటనస్ టాక్సాయిడ్, సెఫోటాక్సిమ్ సోడియం మరియు కాస్టర్ ఆయిల్ కలపడం ద్వారా తాను కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసినట్లు చెప్పాడు. అంతేకాదు  తాను చేసిన కరోనా వ్యాక్సిన్ లో వివిధ అల్లోపతి మెడిసిన్ ఔషదాల్ని కలిపినట్లు, ఆ వ్యాక్సిన్ మంచి ఫలితాల్ని ఇచ్చినట్లు నిందితుడు ప్రహ్లద్ పోలీసులు విచారణలో తెలిపాడు.

Latest Updates