సీజేఐ గొగోయ్ పై లైంగిక ఆరోపణల్లో నిజం లేదు

సీజేఐ రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక ఆరోపణలను సుప్రీం కోర్టు అంతర్గత దర్యాప్తు కమిటీ తోసి పుచ్చింది. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపింది. ఈ ఆరోపణలు నిజం కాదని, తగిన ఆధారాలు లేవని జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని కమిటీ తేల్చి చెప్పింది. ప్యానెల్ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు ఫిర్యాదుదారురాలు నిరాకరించారు.

గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ మహిళ ఇటీవల ఆరోపణలు చేసింది. ఈ విషయమై మొత్తం 22 మంది సుప్రీం కోర్టు జడ్జిలకు గత నెల 19న ఆమె లేఖ రాశారు. ఆ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ బాబ్డే అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయగా… కమిటీలో జస్టిస్ రమణను చేర్చడంపై బాధిత మహిళ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన తప్పుకున్నారు.. ఆయన స్థానంలో జస్టిస్ ఇందు మల్హోత్రాని మూడో సభ్యురాలిగా చేర్చి విచారణ జరిపారు.

సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలలోపై విచారణ జరిపిన కమిటీ… ఆరోపణలో నిజం లేదని కేవలం ఉద్దేశ్యపూర్వకంగానే ఆరోపణలు చేసినట్లుగా నిర్ధారించారు.

Latest Updates