2020 ఐపీఎల్‌ కు లైన్‌ క్లియర్‌ !

టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ వాయిదా ప్రకటన వెలువడిన వెంటనే.. ఐపీఎల్​కు సంబంధించిన పనులను బీసీసీఐ వేగవంతం చేయనుంది. ఎందుకంటే 4వేల కోట్ల రూపాయలతో ముడిపడిన ఉన్నలీగ్ ను నిర్వహించేందుకు ఇండియన్​ బోర్డు అవసరమైన అన్ని చర్యలు ఇప్పటికే మొదలుపెట్టింది. వరల్డ్ కప్ విండో ఖాళీగా ఉంటుంది. కాబట్టి మిగతా బోర్డుల నుంచి కూడా పెద్దగా అడ్డంకులు ఎదురుకావు. కానీ మొదట్నించి ఐపీఎల్​పై అయిష్టతను చూపెడుతున్న ఐసీసీ ఇంకేం మెలిక పెడుతుందో చూడాలి.