వీడియో : ఈ కుక్క తెలివి చూస్తే నవ్వకుండా ఉండలేరు

పెంపుడు జంతువులు మనం ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటాయి. మనం ఇచ్చే ట్రైనింగ్‌తో అవి కొన్ని పనులలో ఆరితేరుతాయి. అలాగే మనం చేసే పనులను చూసి కూడా నేర్చుకుంటాయి. అలాంటి ఓ పెంపుడు కుక్క తన యజమాని తెలివితేటలను మించి ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియోను బ్రిటిష్ ఫైనాన్షియర్ హెలెనా మోరిస్సే తన ట్విట్టర్‌లో రీట్వీట్ చేశారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆ వీడియో దాదాపు 4 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది.

ఒక యజమాని తన కుక్క ముందు టేబుల్ మీద బిస్కెట్‌ను పెట్టి తాను వచ్చేవరకు తినకూడదని చెప్పి బయటకు వెళ్తాడు. అయితే ఆ కుక్క తన యజమాని బయటకు వెళ్లగానే కాసేపు అటూఇటూ చూసి బిస్కెట్‌ను తినేసింది. ఆ తర్వాత తన యజమానికి దొరకకూడదనే ఉద్దేశంతో తెలివిగా ప్రవర్తించింది. యజమాని ఏదైతే డ్రాయర్ నుంచి బిస్కెట్ తీసి ముందు పెట్టాడో.. కుక్క కూడా అదే డ్రాయర్ ఓపెన్ చేసి మరో బిస్కెట్ తీసి టేబుల్ మీద పెట్టింది. ఈ కుక్క తెలివిని చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం కుక్కకు భలే ట్రైనింగ్ ఇచ్చారని కామెంట్ చేస్తున్నారు. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తోంది. మరేందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి.

For More News..

14 ఏళ్లకే వరల్డ్స్ టాలెస్ట్ టీనేజర్‌గా నిలిచిన బాలుడు

వీడియో: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. 12మందికి గాయాలు

Latest Updates