ఒంటి గంటకే షాపులు క్లోజ్ చేయాలె

యాదాద్రి, వెలుగు : కరోనాను కట్టడి చేయడంలో భాగంగా లాక్​డౌన్​ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు యాదాద్రి కలెక్ట‌ర్ అనితా రామచంద్రన్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం నుంచి అన్ని రకాల వ్యాపారాలను మధ్యాహ్నం వరకే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉదయం 7నుంచి సాయంత్రం 5 వరకు షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతి ఉండగా, నేటినుంచి మధ్యాహ్నం 1 గంటకే మూసివేయన్నారు.

ఆ తర్వాత ఎవరైనా షాపులు తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మొబైల్ రైతు బజార్లకు కూడా ఇదే వర్తిస్తుందని చెప్పారు. బ్యాంకులు మాత్రం సాయంత్రం 4 గంటల వరకు, మెడికల్ షాపులు సాయంత్రం 5 వరకు, అపోలో ఫార్మసీ మాత్రం 24 గంటలూ తెరిచి ఉంటాయన్నారు.

Latest Updates