ఇవాళ హైదరాబాద్ లో ఫ్లైఓవర్ల మూసివేత

హైదరాబాద్ లో ఇవాళ(బుధవారం) రాత్రి ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. జగ్‌నే కి రాత్‌ కార్యక్రమంలో భాగంగా మస్లింలు  ఇవాళ రాత్రి ప్రార్ధనలు చేయనున్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా , రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం తెల్లవారుఝాము వరకు గ్రీన్‌ల్యాండ్స్‌ ఫ్లైఓవర్‌, లంగర్‌హౌస్‌, పివిఎన్‌ఆర్‌ ఫ్లైఓవర్లు మినహా నెక్లెస్‌రోడ్డుతో సహా అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు దీనికి సహకరించి…ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

 

Latest Updates