ప్రాణహిత, పెన్ గంగ ఘాట్ల మూసివేత..నిలిచిపోయిన పడవలు

మహారాష్ట్ర లో విజృంభిస్తున్న కరోనా

 ఘాట్ల మూసివేతతో ప్రమాదం తప్పిందంటున్న జనం

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాసులు చాలామంది  ప్రాణహిత, పెన్గంగా నది తీరాలు దాటి మహారాష్ట్రలో పనుల కోసం వెళ్లేవారు. వివిధ రకాల సరుకులు, పంటలు, కూరగాయలు, పాలు అమ్మేందుకు నాటు పడవల మీద అవతలి వైపునకు ప్రయాణించేవారు. సిర్పూర్నియోజకవర్గంలో 25 వరకు నదులు దాటే ప్రాంతాలు (ఫెర్రీ పాయింట్లు) ఉన్నాయి. కౌటాల మండలంలో తుమ్మిడిహెట్టి, గుండాయిపేట, సిర్పూర్(టి) మండలంలో లోన్ వెల్లి, పారిగాం, విర్దండి, చింతలమానపల్లి మండలం గూడెం, కోర్సిని, దిందా, బెజ్జూర్ మండలం సోమిని, కలాయి, కమర్గాం, పెంచికలపేట్మండలంలోని అగర్ గూడా, దహెగాం మండలం గెర్రె, మోట్లగూడం తదితర ఘాట్ల నుంచి రోజు వందలాది మంది నదులు దాటేవారు. లాక్డౌన్ నేపథ్యంలో  పోలీసులు, రెవెన్యూశాఖ వారు కఠినంగా వ్యవహరించి ఘాట్ల నుంచి ప్రయాణాలు నిలిపివేయడంతో కరోనా ఇటువైపునకు రాలేకపోయిందనే అభిప్రాయం ఈ ప్రాంత వాసులు వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడి పడవలు అక్కడే..

కాగజ్నగర్ డివిజన్లో ప్రాణహిత , పెన్గంగా నది తీరాల నుంచి రాకపోకలు ఇతర ప్రాంతాలపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న పోలీసు శాఖ అధికారులు స్పెషల్గా ఘాట్పాయింట్ల వద్ద పడవ నడిపేవారిని నిలువరించారు. ఏ ఒక్క పడవ నడిచినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో 22 రోజులుగా వందలాది నాటుపడవలు ఒడ్లుదాటలేదు.

మంచిర్యాల జిల్లాకూ మేలు..

మంచిర్యాల జిల్లాకూ మహారాష్ట్ర బార్డర్ ఆనుకొని ఉంది. ప్రాణహిత నది ద్వారా వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ఏడు చోట్ల ఘాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి నాటు పడవల ద్వారా రోజుకు సుమారు 15 వందల మంది రాకపోకలు సాగించేవారు. లాక్ డౌన్లో భాగంగా పడవ ప్రయాణం బంద్అయ్యింది. ఫలితంగా కోరానా వ్యాప్తి ఒకింత అరికట్టినట్టయింది. లేదంటే మహారాష్ట్ర ప్రభావం జిల్లాపై పడేది.

Latest Updates