పార్టీ మారిన MLAలపై స్పీకర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు

పార్టీ మారిన MLAలను అనర్హులుగా ప్రకటించాలి 

స్పీకర్ ను కోరిన CLP నేతల బృందం

కామారెడ్డి జిల్లా : బాన్స్ వాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతలు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తో పాటు కొందరు కాంగ్రెస్ నేతలు… పోచారంను కలిసివారిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి.. టీఆర్ఎస్ లోకి వెళ్లిన తమ ఎమ్మెల్యేల గురించి స్పీకర్ తో చర్చించారు సీఎల్పీ నేతలు. పార్టీ మారిన MLAలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ ని కోరారు కాంగ్రెస్ నేతలు. TRS పార్టీ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందనీ… ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని చెప్పారు.

Latest Updates