ఫార్మా కంపెనీల పేరుతో పేదల భూములు లాక్కుంటున్నరు

రంగారెడ్డి జిల్లా: యాచారం మండలంలో పార్మాసిటీలో రైతుల వద్ద భూములు తీసుకుంటూ దమనకాండ కొనసాగిస్తున్నారని సీరియస్ అయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి… ఇవ్వకుండా తిరిగి దళిత, గిరిజనుల భూములే గుంజుకుంటున్నారన్నారు. మీరు దళితులకు ఇస్తానన్న భూములు ఇవ్వకపోగా..దళితలకు కాంగ్రెస్ పంచిన అస్సైండ్ ల్యాండ్స్ భూములను లాక్కుంటరా? అని ప్రశ్నిచారు. మల్టీనేషనల్ కంపెనీలకు, విషం వెదజల్లే ఫార్మ కంపెనీలకు ప్రజా ప్రయోజనాల పేరుతో భూములు తీసుకుంటున్నారని చెప్పారు.

ఒక నాగార్జున సాగర్, ఒక BDL, ఒక BHEL, వంటి ప్రాజెక్ట్ కోసం అంటే ప్రజా ప్రయోజనాల కోసం, ఫార్మ కంపెనీలు ప్రజా ప్రయోజనాల కోసం ఎలా అవుతాయన్నారు. తెలంగాణ ప్రజలను అమ్మకానికి పెట్టడానికేనా తెలంగాణ తెచ్చుకుందన్నారు. పేదల భూములను పెద్దలకు పెట్టేలా తీసుకొని బ్రోకర్ లాగా కేసీఆర్ వ్యవరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అసైన్ ల్యాండ్స్ గుంజుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి చెప్పాలని ప్రజలను కోరుతున్నామన్నారు భట్టి విక్రమార్క.

Latest Updates