ఈ ఏడేళ్లలో 14 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు 417 ఇండ్లు క‌ట్టించిన్రు

ఖమ్మం : ఎన్నికల స‌మ‌యంలో అర్హులైనవారికి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. గురువారం ఖమ్మం పట్టణంలోని దంసలాపురం ప్రాంతంలో పునాదులేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంతాన్ని భట్టి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఖమ్మంలో ఏడాదికి 2 వేల ఇండ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్, కేటీఆర్ లు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఖమ్మంలో 14 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉండాలని, కానీ..ఈ ఏడేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది 417 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మాత్రమేనని అన్నారు. చెప్పిన 12 వేల ఇండ్లకు.. ఇక్కడ పునాదులేసి వదిలేసిన 192 ఇండ్లకు లెక్క ఎలా సరిపోతుందని భట్టి ప్ర‌శ్నించారు.

అల్లీపురంలో కూడా డబుల్ ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిసిందని.. అక్కడ కూడా చూశాక.. ఖమ్మంలో ఎన్ని ఇండ్లు కడుతున్నారు.. వాటిని ఎవరికి ఇవ్వబోతున్నారు? అన్న ప్రశ్నలు తేలాల్సి ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని డివిజన్ల దరఖాస్తులే దాదాపు 15 వేలకు పైగా ఉంటాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, నగర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ దీపక్ చౌదరి తదితరలు పాల్గొన్నారు.

CLP leader Bhatti Vikramarka inspected the area of ​​double bedroom houses in Khammam town on Thursday

Latest Updates