6 గంటల నిరీక్షణ తర్వాత సీఎం నామినేషన్

తన నామినేషన్‌ను దాఖలు చేసేందుకు 6 గంటలు వేచి చూశారు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌. ఢిల్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కేజ్రీవాల్.. మంగళవారం సాయంత్రం జామ్‌నగర్‌లోని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయంలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆయన… చాలా సేపు క్యూ లోనే నించుని ఉన్నారు. తన టోకెన్‌ నంబర్‌ 45 అని ట్వీట్ కూడా చేశారు కేజ్రీవాల్. అయితే కావాలనే బీజేపీ.. కేజ్రీవాల్‌ కంటే ముందు 45 మంది స్వతంత్ర అభ్యర్థులను నామినేషన్‌ దాఖలుకు లైన్లో నిల్చోబెట్టిందని ఆప్‌ పార్టీ నేతలు ఆరోపించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన ఢిల్లీకి మళ్లీ కేజ్రీవాల్‌ సీఎం అవుతారని అన్నారు.

CM Arvind Kejriwal files nomination after waiting for over 6 hours

Latest Updates