మూడు మంత్రాలతో ముందుకెళ్తున్న గెహ్లాట్

న్యూఢిల్లీ: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం ఎట్టకేలకు ముగిసింది. సచిన్‌ పైలట్‌తోపాటు అసంతృప్త ఎమ్మెల్యేలపై ‘మన్నించడం, మర్చిపోవడం’ అనే విధానంతో సీఎం అశోక్ గెహ్లాట్ వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన రెబల్‌ ఎమ్మెల్యేలతో కలసి ముందుకు వెళ్లడానికి ఈ మంత్రాన్నే ఆయన అవలంభిస్తున్నారు. ఈమధ్యే కాంగ్రెస్ అధిష్టానాన్ని కలసిన పైలట్ షెడ్యూల్ ప్రకారం గురువారం గెహ్లాట్‌ను మీట్ అవనున్నారు.

‘సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే కాంగ్రెస్ ధ్యేయం. గత నెల రోజుల్లో పార్టీలో అపార్థం చేసుకునే కొన్ని ఘటనలు జరిగాయి. వాటిని దేశ, రాష్ట్ర ఆసక్తుల దృష్ట్యా మనం మర్చిపోవాలి, క్షమించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఈ పోరాటంలో ‘మన్నించడం, మర్చిపోవడం, ముందుకెళ్లడం’ పద్ధతులతో మన శక్తులను ఒక్కటి చేయాలి’ అని గెహ్లాట్ ట్వీట్ చేశారు.

Latest Updates