నిన్నటి వరకు విభేదాలు..నేడు నవ్వుతూ ముచ్చట్లు

నిన్నటి వరకూ ఉప్పూ నిప్పులా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కలిసిపోయారు. ఇవాళ జరిగిన కేబినెట్ మీటింగ్ లో సీఎం, సీఎస్ నవ్వుతూ కనిపించారు.  చంద్రబాబు  పక్కన కూర్చున్న సీఎస్ సుబ్రహ్మణ్యం సరదాగా మాట్లాడుతూ కనిపించారు.

సీఎస్ గా పునేఠను తప్పించి ఈసీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించినప్పటి నుంచి సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. జగన్ కేసుల్లో నిందితుడైన ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఎలా సీఎస్‌గా నియమిస్తారంటూ అభ్యంతరం  వ్యక్తం చేశారు. అటు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సైతం సీఎం పట్ల దూకుడుగానే వ్యవహరించారు. చంద్రబాబు ఆపద్ధర్మ సీఎం అని..ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదని బాహాటంగానే విమర్శించారు. మే 23 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నా ‘అధికారాలు లేని సీఎం’ అని వ్యాఖ్యానిచారు.  అంతేకాకుండా ఈనెల 10నే జరగాల్సి ఉన్న కేబినెట్ మీటింగ్  విషయంలోనూ చంద్రబాబుతో విభేదించారు సీఎస్. కేబినెట్ మీటింగ్ కు సంబంధించిన ఎజెండాను 48 గంటల ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి అనుమతి తీసుకున్న తర్వాతే మంత్రివర్గం సమావేశం నిర్వహించాలని స్పష్టం చేశారు సీఎస్. ఇలా విభేదాలతో ఉన్న సీఎం, సీఎస్ సరదాగా కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

 

Latest Updates