నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

CM chandrababu compaigning in chittoor, nellore today

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మదనపల్లెలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు చంద్రగిరిలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చిత్తూరు జిల్లా నగరిలో, సాయంత్రం 4.45 గంటలకు సర్వేపల్లిలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6.15 గంటలకు నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో చంద్రబాబు రోడ్‌ షో నిర్వహించనున్నారు.

Latest Updates