మాజీ ఎమ్మెల్యే నంద్యాల మృతిపట్ల సీఎం సంతాపం

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్ రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్న శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లో అనేక ఉన్నత విలువలు నెలకొల్పారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ ఉదయం హైదరాబాద్ లో నంద్యాల శ్రీనివాస్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. నంద్యాల మృతిపట్ల మంత్రి జగదీశ్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలంగాణ రైతు పోరాటంలో నంద్యాల కీలక పాత్రపోషించారని ఆయన అన్నారు.

Latest Updates