గ్రేటర్ లో ఆర్టీసీ బస్సులకు సీఎం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌ : రేపట్నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. సీఎం ఆదేశాలతో 25 శాతం బస్సులను మాత్రమే నడపనుంది ఆర్టీసీ. ఇంటర్ స్టేట్ బస్సులను కూడా కేవలం కర్నాటక, మహారాష్ట్రకు మాత్రమే నడిపించేందుకు ఓకే చెప్పారు సీఎం కేసీఆర్. మొదట సిటీ బస్సులను 50 శాతం నడపనున్నట్లు ప్రకటించారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. కానీ సీఎం ఆదేశాలతో ప్రస్తుతం 25 శాతం మాత్రమే బస్సులు నడపనున్నట్లు చెప్పారు రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్.

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణాల వల్ల హైదరాబాద్‌ సిటీలో ఆర్టీసీ బస్సులు మూతపడ్డాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. జిల్లాల్లో కేసుల సంఖ్య కొంత మేర తగ్గడం, ప్రజా రవాణకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకావడంతో రాజధాని నుంచి జిల్లా సర్వీసులను ప్రభుత్వం గతంలో ప్రారంభించింది. అయితే గ్రేటర్‌లో కరోనా విజృంభణ అదుపులోకి రాకపోవడం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేపోయింది.

ఈ క్రమంలోనే గతవారం రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, కోలుకునే వారిసంఖ్య పెరగడంతో గ్రేటర్‌లో ఆర్టీసీ సర్వీసులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకుని గ్రేటర్‌ పరిధిలో శుక్రవారం నుంచి 25 శాతం బస్సులు నడిపేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బుధవారం నుంచే సిటీ శివారుల్లో ఆర్టీసీ బస్సులు ప్రారంభమైన విషయం తెలిసిందే.

Latest Updates