కవితను ఓడించినా సీఎంకు బుద్ధి రాలేదు

తెలంగాణ ద్రోహులకు సీఎం పదవులిచ్చారు

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో కూతురు కవితను జనం ఓడించినా సీఎం కేసీఆర్​కు బుద్ధి రాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని ఎర్రబెల్లి, తలసాని లాంటి తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులిచ్చి ఉద్యమకారులను, అమరవీరులను అవమానించారన్నారు. నిజాం, రజాకార్ల పాలనను కేసీఆర్ గుర్తు చేస్తున్నారని, తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తుంటే మైక్ ఇవ్వలేదని, సంబంధం లేని మంత్రి ఎర్రబెల్లి మధ్యలో కల్పించుకున్నారని ఆరోపించారు. దళితుడు సీఎల్పీ నేత అయితే ఓర్చుకోని సీఎం కేసీఆర్, 12 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొన్నారన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీకి ప్రజలు ముగింపు పలకాలని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.

For More News..

ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

17 నెలల తర్వాత మండలికి వచ్చిన కేసీఆర్

Latest Updates