
ఛత్తీస్గఢ్ ఘటనలో చనిపోయిన జవాన్ల మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాలకు చెరో రూ.30లక్షల చొప్పున సీఎం జగన్ ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సహాయాన్ని వెనువెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.
బీజాపూర్,సుకుమా జిల్లాల సరిహద్దులో జరిగిన కాల్పుల్లో మురళీకృష్ణ, జగదీష్ చనిపోయారు.