చల్లా కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్

కర్నూలు:  దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈనెల 1వ తేదీన కరోనాతో చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూసిన విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం ఆరంభ సమయంలో జరిగిన ఘటనపై జగన్ వెంటనే స్పందించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఈ రోజు బుధవారం ఉదయం చల్లా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రత్యేకంగా విజయవాడ నుండి అవుకు వచ్చారు. సరిగ్గా 11:45 గంటలకు  నిమిషాల సమయంలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో  అవుకు గ్రామానికి బయలుదేరారు. 12.20 గంటలకు అవుకు గ్రామ శివారులో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న సీఎం జగన్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తోపాటు, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన హై స్కూల్ మీదుగా మార్కెట్ వీధి, బస్టాండ్ మీదుగా నేరుగా 12:32 గంటలకు దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. సీఎం జగన్ ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు  పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సీఎంను చూసేందుకు ఉత్సాహం చూపారు. దారి పొడవునా ప్రజలు బారులు తీరి తిలకించారు. ప్రజలకు సీఎం జగన్ నవ్వుతూ, నమస్కరిస్తూ ముందుకు సాగటం తో ప్రజలు కూడా కేరింతలు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు.

చల్లా చిత్రపటానికి నివాళులర్పించిన జగన్

అవుకు వచ్చిన సీఎం జగన్ తొలుత దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. చల్లా భగీరథ రెడ్డి తన కుటుంబ సభ్యులను, బంధువులను సీఎంకు పరిచయం చేశారు. దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి సతీమణి చల్లా శ్రీదేవి, కుమారుడు చల్లా భగీరథ రెడ్డి, సోదరలు చల్లా రామేశ్వర రెడ్డి, చల్లా రఘునాద్ రెడ్డి, చల్లా ప్రభాకర్ రెడ్డి, అల్లుళ్లు పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డి. రవీంద్రనాథ్ రెడ్డితో పాటు కూతురులు,  కోడళ్లు, మనవళ్లు, తన కుటుంబ సభ్యులు 25 మందిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారికి ధైర్యం చెప్పి ఓదార్చారు.  సీఎం జగన్ తో పాటు జిల్లా ఇంచార్జి మంత్రి అయిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్ర నాథ్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, తోగూర్ ఆర్థర్, కాటసాని రామిరెడ్డి పాటు జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె.పక్కిరప్ప, జె సి రామ్ సుందర్ రెడ్డి, జేసీ (ఆసరా) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు. అనంతరం హెలికాప్టర్లో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు.

ముఖ్యమంత్రి జగన్ కు ఘనంగా వీడ్కోలు

అవుకు హెలిప్యాడ్ నుండి ఓర్వకల్ విమానాశ్రయానికి 1-37 నిమిషాల కు చేరుకున్న సీఎం జగన్ కు  ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీమతి కె. శ్రీదేవి, చెరుకులపాడు కె. ప్రదీప్ రెడ్డి,  కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యేకాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్,  కర్నూలు మున్సిపల్ కమిషనర్ డి కె బాలాజీ,  వైసీపీ పార్టీ నేత బీ వై రామయ్య, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ తిమ్మప్ప, ఇతర జిల్లా అధికారులు వీడ్కోలు పలికారు. విమానం ఎక్కే ముందు సీఎం జగన్ అందరికీ అభివాదం చేస్తూ ప్రత్యేక విమానంలో  విజయవాడ కు  బయలుదేరారు.

డిజిటల్‌ కరెన్సీకి పెరుగుతున్న ప్రాధాన్యత

కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు.. పోలీసుల అదుపులో భూమా అఖిలప్రియ

Latest Updates