పంద్రాగస్టున అమెరికాకు సీఎం జగన్

అమరావతి : ఆగస్ట్ 15 నుంచి 24 వరకూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అమెరికాలో పర్యటించనున్నారు. ఇటీవలే జెరూసలేం పర్యటనకు వెళ్లొచ్చిన వైఎస్ జగన్… తాజాగా.. పదిరోజుల అమెరికా పర్యటనకు సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వెళ్తున్నారు సీఎం.

ఈ నెల 15న ఉదయం ఏపీలో పంద్రాగస్ట్ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం హైద్రాబాద్ చేరుకుని… అమెరికా బయలుదేరతారు వైఎస్ జగన్. 17న ఉత్తర అమెరికాలోని డల్లాస్ లో ప్రవాస తెలుగువారు సీఎం జగన్ కు స్వాగత సభ ఏర్పాటుచేశారు. భారీస్థాయిలో ఈ సభ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం హోదాలో మొదటిసారి ప్రవాస తెలుగు వారితో ఆత్మీయ సమావేశంలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగించనున్నారు. తిరిగి ఈ నెల 24న అమరావతి చేరుకుంటారు సీఎం జగన్.

Latest Updates