ఎన్నికల కమిషనర్ పద్దతి ఏం బాలేదు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన..రాష్ట్రంలో చంద్రబాబు రాక్షస పాలన సృష్టించేందుకు కుట్ర చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించారని అన్నారు.

చంద్రబాబు ఏం చెబితే అది చేస్తున్నారు

రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ అలా చేస్తున్నారని అన్నారు. కరోనా వైరస్ సాకుతో ఎన్నికల్ని వాయిదా వేయడం ఎంతవరకు సబబు అన్నారు. అనుకున్న సమయానికి ఎన్నికలు జరగడం వల్ల రాష్ట్రానికి రూ.5వేల కోట్ల నిధులు వస్తాయని, ఆ నిధులు రాకుండా ఉండేలా చంద్రబాబు ఎన్నికల అధికారితో కలిసి కుట్ర చేస్తున్నారని చెప్పారు.

ఎన్నికల అధికారి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల కోడ్ అంటూ ఐఏఎస్, పోలీస్ ఉన్నతాధికారుల్ని ట్రాన్సఫర్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ పట్ల చీఫ్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ లకు చెప్పకుండా ఐఏఎస్ లకు నోటీసులు జారీ చేసి అయోమయానికి గురిచేస్తున్నారని చెప్పారు.

చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుంది

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతున్నారని  తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలు కలిపి 10243స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాని అందులో 54594 మంది అభ్యర్ధులు నామినేషన్లు వేస్తే కేవలం 43 చోట్ల మాత్రమే స్వల్ప ఘర్షణలు జరిగాయన్నారు.  2794వార్డ్ లు, డివిజన్లలో ఎన్నికలు జరుగతుంటే 15185 మంది అభ్యర్ధులు నామినేషన్లు వేశారని 14చోట్ల మాత్రమే స్వల్ప ఘర్షణలు జరిగాయని తెలిపారు. స్వల్ప ఘర్షణలు జరిగితే చంద్రబాబు రాష్ట్రంలో అల్లకల్లోలం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారని, లోకల్ బాడీఎన్నికలు జరగితే ఇంతకంటే ఎక్కువగా  ఘర్షణలు జరగలేదా అని ప్రశ్నించారు.

పోలీసుల పనితీరు తీరు అభినందనీయం

రాష్ట్ర పోలీసులు శాంతి భద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అభినందనలు తెలిపారు. ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో జరిగిన ఘర్షణల్లో పార్టీలకు అతీతంగా మొత్తం 8 చోట్ల అటెంప్ట్ టూ మర్డర్ కేసులు నమోదు చేశారని సీఎం జగన్ ప్రశంసించారు.

Latest Updates