TDPకి జగన్ వార్నింగ్ : మీరు 23 మందే…మేము 150 మంది

cm-jagan-warning-tdp

ఏపీ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సున్నా వడ్డీ, పొదుపు సంఘాలపై సీఎం జగన్ మాట్లాడుతుండగా టీడీపీ సభ్యుల అడ్డుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యుల తీరుపై జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతలు కనీసం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. సభలో మీ బలం ఎంత..మా బలం ఎంత అని..మేం తలుచుకుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేరంటూ మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు బుద్ధి జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Latest Updates