విజయ డైరీని నాశనం చేశారు: కేసీఆర్

రైతు సమన్వయ సమితులను త్వరలోనే మరింత యాక్టివేట్ చేస్తామన్నారు సీఎం కేసీఆర్. మహిళా సంఘాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కల్తీలేని స్వచ్ఛమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందాలన్నారు. ప్రభుత్వ డెయిరీ అయిన విజయ పాల వ్యవస్థను కొందరు నాశనం చేశారని అన్నారు. కల్తీని అరికట్టేందుకు పీడీఎస్ వ్యవస్థ బలోపేతం చేయాల్సి ఉందని తెలిపారు.రేషన్ డీలర్లకు కమీషన్లు పెంచాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్..  రాష్ట్రంలో డీలర్ల కొరతను రెండు, మూడు  నెలల్లో తీరుస్తామని అసెంబ్లీలో చెప్పారు కేసీఆర్.