కరోనా అలర్ట్.. అవసరమైతే రూ.5 వేల కోట్లు ఖర్చుచేస్తాం: కేసీఆర్

దేశ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తుండటంతో  తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కరోనాపై  ప్రకటన చేశారు. వెయ్యి కాదని అవసరమైతే.. కరోనాను నివారించేందుకు 5 వేల కోట్లైనా ఖర్చు పెడతామన్నారు.   దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా వచ్చిందన్నారు.  65 మందిలో 17 విదేశీయులేనన్నారు. పదిమంది  కరోనాను జయించారని..ఇద్దరు చనిపోయారన్నారు. తాజాగా ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. ఆయనకు గాంధీలో ట్రీట్ మెంట్ ఇస్తున్నారని..మరో ఇద్దరి అనుమానితుల రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు. విదేశీయులే మనదేశానికి కరోనాను తీసుకొస్తున్నారన్నారు.

ఆరు ప్రధాన నగరాల్లో హైదరాబాద్  ఒకటి కాబట్టి ఎయిర్ పోర్టుల్లో జాగ్రత్త వహిస్తున్నామన్నారు. చైనా,కొరియా,ఇరాన్, ప్రాన్స్, స్పెయిన్, లాంటి దేశాల నుండి వచ్చే వారిని ఇండియా కు రాకుండా వీసా లు రద్దు చేశారన్నారు. ఒక వేళ మన దేశం వాళ్ళు ఈ దేశాల నుండి మన దేశానికి వస్తే 14 రోజులు డాక్టర్ల బృందం తో టెస్ట్ లు చేస్తారన్నారు. 200 మంది డాక్టర్ల బృందం మన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉన్నారన్నారు. వాళ్లకు టెస్ట్ చేసి ఎలాంటి వ్యాధి రాకపోతే వాళ్ళను ఇంటికి పంపిస్తారని చెప్పారు.

సూళ్లు,పెళ్లిల్లు,ఇతర కార్యక్రమాలు బంద్ చేయాలా? వద్దా అనేది చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం  కోరానాపై హైలెవల్ కమీటీ సమావేశం జరుగుతుందన్నారు. హైలెవల్ కమిటీ నిర్ణయం తర్వాత సాయంత్రం  కేబినెట్ మీటింగ్ లో కరోనాను ఎదుర్కునేందుకు తీసుకునే చర్యలపై చర్చిస్తామన్నారు.

Latest Updates