బడ్జెట్ పై కేసీఆర్ రియాక్షన్

కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతుందన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధుల్లో భారీగా కోత విధించారన్నారు. 2019-2020 ఆర్థిక సంవంత్సరంలో తెలంగాణకు రావాల్సిన నిధుల్లో రూ.3731 కోట్లు తగ్గాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులడిగితే మొండి చేయి చూపిందన్నారు. కేంద్ర పన్నుల్లో వాటాను తగ్గించడం దారుణమన్నారు. కేంద్రం కేటాయించే నిధులకు ఇచ్చే నిధులకు సంబంధం లేదన్నారు. నిధుల కోత వల్ల రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు కొరత ఏర్పడుతుందన్నారు. .కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే దిక్కవుతాయన్నారు.

Latest Updates