సిద్దిపేటలో కేసీఆర్, హైదరాబాద్ లో కేటీఆర్ ఓటు

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల  పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. సిద్దిపేట జిల్లా చింతమడకలో సీఎం కేసీఆర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.  అలాగే హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాలులో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన సతీమణి శైలజ ఓటు వేశారు.

Latest Updates